సౌజన్యరావుకి మాస్ వార్నింగ్ ఇచ్చిన రిషి.. ఫణీంద్ర ఎమోషనల్!
on Sep 19, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -871 లో..సౌజన్య రావు, శైలేంద్రల ప్లాన్ తిప్పికొట్టేలా మురుగన్ కోటి రూపాయలు తీసుకొని వస్తాడు. అసలు మిమ్మల్ని ఎవరు పంపించారని శైలేంద్ర అనగానే.. ఆ విషయంతో మీకు సంబంధం లేదు, వసుధర మేడమ్ మీరు చెప్పండని మురుగన్ అనగానే.. నేను చూసుకుంటా మీరు వెళ్ళండని మురుగన్ కి వసుధార చెప్తుంది. ఆ తర్వాత మురుగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అసలు విషయానికి వస్తే మురుగన్ దగ్గర డబ్బులు అడిగి రిషి తనని తీసుకొని వెళ్ళమని చెప్తేనే మురుగన్ DBST కాలేజీకి వస్తాడు.
ఆ తర్వాత ఎవరతను? అతని వెనకాల ఎవరు ఉన్నారని సౌజన్య రావు అడుగుతాడు. సరే మీకు చూపిస్తానని వసుధార వీడియో కాల్ ఆన్ చేసి రిషిని చూపిస్తుంది. రిషిని చూసి శైలేంద్ర షాక్ అవుతాడు. రిషి ఎవరితో మాట్లాడకుండా కేవలం సౌజన్య రావుకి వార్నింగ్ ఇస్తాడు. ఇంకొకసారి నా కాలేజీ జోలికి రాకంటూ గట్టిగానే రిషి వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత సౌజన్య రావు వెళ్లిపోతుంటే.. మహేంద్ర పిలిచి మరి అగ్రిమెంట్ పేపర్ చింపివేస్తావ్ డబ్బులు తీసుకొని వెళ్ళమని మహేంద్ర చెప్పగానే సౌజన్య రావు అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత నాకు రిషితో మాట్లాడాలని ఉంది. రిషి ఎక్కడ అని వసుధారని మహేంద్ర అడుగుతాడు. సరే చూపిస్తా వెళదాం పదండని వసుధార అనగానే అందరూ రిషి దగ్గరికి బయల్దేరి వెళ్తారు. మరొక వైపు రిషి అందరిని ఆశ్చర్యంగా చూస్తాడు. వెంటనే ఫణింద్ర వెళ్లి.. రిషిని హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత దేవాయని కూడా వెళ్లి హగ్ చేసుకుంటుంది. రిషిని మళ్ళీ తిరిగి రమ్మని ఫణింద్ర అడుగుతాడు.
ఆ తర్వాత ఇక నేను రాలేను.. నన్ను ఈ ఇద్దరు మోసగాడని నింద వేశారని రిషి అనగానే.. నువ్వు ఏం తప్పు చెయ్యలేదని నిరూపించుకోవాలని ఫణింద్ర చెప్తాడు. నేను నిరూపించుకొని వాళ్ళని దోశులను చెయ్యలేనని రిషి అంటాడు. ఇప్పటికైన అసలు ఏం జరిగింది చెప్పమని జగతిని ఫణింద్ర అడుగుతాడు. చెప్తానని జగతి అనగానే.. శైలేంద్ర, దేవయాని ఇద్దరు టెన్షన్ పడుతారు. ఆ తర్వాత జగతి చెప్పబోతుంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రయోజనం లేదని రిషి అంటాడు. రిషి మమ్మల్ని వదిలి వెళ్ళవద్దని ఫణింద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
